Radhe Shyam | ప్రభాస్ నుంచి సినిమా వచ్చి దాదాపు మూడున్నరేళ్లు అయింది. ఎప్పుడెప్పుడు అభిమాన హీరోను వెండి తెరపై చూస్తామా అని ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. అభిమానుల నిరీక్షణకు ఫలితంగా గత శుక్రవారం ‘రాధేశ్యామ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రం విడుదలైన మొదటి షో నుంచే నెగెటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ అభిమాని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కర్నూల్ నగరంలోని తిలక్‌నగర్‌లో నివాసముండే రవితేజ ‘రాధేశ్యామ్’ సినిమా చూసి మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహాత్య చేసుకున్నాడు. సినిమా బాగాలేదని భాదతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా మృతిడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్ తన ఇమేజ్‌కు భిన్నంగా ఈ చిత్రంలో నటించాడు. మూడున్నరేళ్ళ తరువాత ప్రభాస్‌ను వెండి తెరపై చూస్తున్నాం అని భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ప్రతి అభిమానిని ‘రాధేశ్యామ్’ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు.