Project-k Movie | ప్రభాస్ హీరోగా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రాజెక్ట్-K’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. ముందు నుండి మేకర్స్ ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్లో రూపొందిస్తున్నట్లు చెబుతూనే వస్తున్నారు. దానికి తగ్గట్లే ఈ సినిమా కోసం కొత్తగా కార్లు వంటివి తయారు చేస్తున్నారు. ఇక ఇటీవలే రీఇన్వెంటింగ్ ది వీల్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఒక్క టైరు కోసం చిత్రయూనిట్ ఎంత కష్టపడిందో ఆ వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ వీల్ సహాయంతోనే ప్రభాస్ టైమ్ ట్రావెల్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చిన అది ప్రేక్షకుల్లో మంచి అటెన్షన్ క్రియేట్ చేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా మ్యూజిక్ వర్క్స్ స్టార్ అయినట్లు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ వెల్లడించాడు. ప్రాజెక్ట్ కే కోసం నా మ్యూజికల్ జర్నీ ఆఫ్రీకాలో స్టార్ట్ అయింది దీనికోసం ప్రపంచమంతా తిరుగుతాను అంటూ ఇన్‌స్టాలో వెల్లడించాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటి వరకు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. కానీ నాగ్ అశ్విన్ ఈ సినిమాను సరికొత్త రీతిలో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నట్లు ఇన్ సైడ్ టాక్. పైగా ఈ సినిమాలో సింగీతం శ్రీనివాస్ రావు భాగం కావడంతో ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. వైజయంతీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
#Prabhas's #ProjectK Music Works Started in Africa 💥💥
– @Music_Santhosh (Music Director) via Instagram pic.twitter.com/Hex3HdEE5j
— BoxOffice Ka Baap (@BoxOfficeKaBaap) June 9, 2023