గగన్బాబు, కశికాకపూర్ జంటగా, సత్యం రాజేష్, సాయి రోనఖ్ కీలక పాత్రధారులుగా ఎ.కె.జంపన్న దర్శకత్వంలో, తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి క్లాప్ ఇవ్వగా, వివేక్ కూచిభట్ల కెమెరా స్విచాన్ చేశారు. చిత్ర దర్శకుడు ఎ.కె.జంపన్నకు చిత్ర నిర్మాత తోట లక్ష్మీకోటేశ్వరరావు స్క్రిప్ట్‌ని అందించారు. తొలిషాట్‌కు దర్శకుడు వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.
అతిథులంతా చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. కథ నచ్చి, ఈ సినిమాను తానే నిర్మించాలనే పట్టుదలతో నిర్మాత కోటేశ్వరరావు గోల్డెన్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించారని, ఇదొక ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ అని, త్వరలోనే షూటింగ్ మొదలుపెడతామని దర్శకుడు జంపన్న తెలిపారు. తమ సంస్థ నుంచి వస్తున్న ఈ తొలి చిత్రం.. దేశమంతా మాట్లాడుకునేలా ఉంటుందని నిర్మాత తోట లక్ష్మీకోటేశ్వరరావు చెప్పారు. ఇంకా హీరోహీరోయిన్లు గగన్, కాశికా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: వి.కె.రామరాజు, సంగీతం: అనూప్ రూబెన్స్.