Arjun Reddy Movie | ఐదేళ్ల క్రితం వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రిలీజ్‌కు ముందు నుంచే ఈ సినిమాపై ఎక్కడలేని బజ్ ఏర్పడింది. ఇక రిలీజ్ తర్వాత పాజిటీవ్ టాక్ రావడంతో తిరుగులేని వసూళ్లను సాధించింది. ఈ సినిమాకు ఎన్ని ప్రశంసలు దక్కాయో అంతకంటే ఎక్కువే విమర్శలు కూడా వచ్చాయి. యూత్‌ను పక్కదోవ పట్టించేలా ఉందని, సినిమా మొత్తం భూతులే ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే మెజారిటీ ఆడియెన్స్ మాత్రం ఒకప్పుడు శివ ఎలాగో ఇప్పుడు అర్జున్ రెడ్డి అలాగా ఒక ట్రెండ్ సెట్టరని వెల్లడించారు.
కాగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు సందీప్ ఎన్నో కష్టాలు పడ్డానని ఓ ఇంటర్వూలో అప్పట్లో తెలిపాడు. ఏ నిర్మాత కూడా ధైర్యం చేయలేకపోయాడని దాంతో తన అన్ననే ప్రొడ్యూసర్‌గా మారాడని తెలిపాడు. కాగా అర్జున్ రెడ్డి సినిమాను నిర్మించేందుకు భయపడినట్లు సీతారామం, ప్రాజెక్ట్-K నిర్మాత స్వప్నదత్ తాజాగా వెల్లడించింది. అర్జున్ రెడ్డి సినిమా కథ తనకు బాగా నచ్చిందని, కాకపోతే.. సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయలేకపోయానని చెప్పింది. ఒక వేళ సినిమా అటు ఇటు అయితే ఆడపిల్ల ఇలాంటి సినిమా చేసిందా అని విమర్శిస్తారని భయపడినట్లు చెప్పుకొచ్చింది.