టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో సంక్రాంతి రేసులోకి దూసుకొస్తున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నారి నారి నడుమ మురారి’ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ ట్రైలర్లో అందరినీ ఆకర్షించిన అంశం శర్వానంద్ నటన మాత్రమే కాదు.. టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ SKN పై వచ్చిన ఒక ఫన్నీ డైలాగ్ కూడా. ప్రస్తుతం టాలీవుడ్లో ఏ చిన్న సినిమా వేడుక జరిగినా అక్కడ నిర్మాత SKN ఉండాల్సిందే అన్న సంగతి తెలిసిందే. స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుంటే గంటల తరబడి వైరల్ స్పీచ్‌లు ఇవ్వడం ఆయన స్టైల్. తాజాగా ‘నారి నారి నడుమ మురారి’ ట్రైలర్లో వెన్నెల కిషోర్ చెప్పిన ఒక డైలాగ్ దీనికి అద్దం పడుతోంది.
“ముందు ఆ SKN స్పీచ్‌లు చూడటం మానేయ్ రా..” అంటూ వెన్నెల కిషోర్ వేసిన సెటైర్ ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ప్రమోషన్లకే పరిమితం కాకుండా, ఏకంగా వెండితెరపై కూడా SKN పేరు మారుమోగిపోతుండటం విశేషం.
గతంలో ‘సామజవరగమన’ వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. యంగ్ హీరో శ్రీవిష్ణు ఈ సినిమాలో కీలకమైన కేమియో రోల్లో కనిపించనున్నారు. సీనియర్ నటుడు నరేష్, సునీల్, వెన్నెల కిషోర్, సత్య, సుదర్శన్, గెటప్ శ్రీను వంటి భారీ కామెడీ టీమ్ ఈ సినిమాలో ఉంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తుండగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ముగ్గుల పండుగ సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్లో కనిపిస్తున్న వినోదాన్ని చూస్తుంటే, శర్వానంద్ మరో ఫ్యామిలీ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా SKN పై వేసిన ఆ సెటైరికల్ డైలాగ్ థియేటర్లలో ఏ రేంజ్ నవ్వులు పూయిస్తుందో చూడాలి!