Producer Ravi Speech | ఈ మధ్య నిర్మాతలు తమ సినిమాల ప్రమోషన్లను కొత్తగా ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. నటుడు నాని నిర్మాణంలో వస్తున్న కోర్ట్ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాని మాట్లాడుతూ.. కోర్ట్ సినిమాకు దయచేసి వెళ్లండని అభిమానులను వేడుకున్నాడు. అంతేగాకుండా ఈ సినిమా వెళ్లి అది నచ్చకుంటే ఏప్రిల్లో విడుదలవుతున్న నా హిట్ 3 సినిమాకు ఎవరు రాకండంటూ బోల్డ్ కామెంట్ చేశాడు. దీంతో నాని చేసిన వ్యాఖ్యలు అప్పుడు వైరల్గా మారాయి.
అయితే నాని లాగానే మరో నిర్మాత కూడా తన సినిమా నచ్చకుంటే నన్ను కొట్టండంటూ చెప్పుకోచ్చాడు. యువ కథనాయకుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం దిల్రుబా (Dilruba). ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తుండగా.. మార్చి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది చిత్రయూనిట్.
అయితే ఈ వేడుకలో నిర్మాత రవి మాట్లాడుతూ.. దిల్రుబా సినిమాలో ఫైట్స్ అద్భుతంగా వచ్చాయని తెలిపారు. మీరు సినిమా చూసేటప్పుడు ఒకవేళ ఫైట్స్ నచ్చకుంటే నన్ను సినిమా విడుదల అనంతరం పెట్టే ప్రెస్మీట్లో చితక్కొట్టేయండని తెలిపాడు. అలాగే కిరణ్ అబ్బవరం ఫైట్స్ చూసి మీరు మెస్మరైజ్ అవ్వకపోతే నేను ప్యూచర్లో సినిమాలు చేయనంటూ నిర్మాత తెలిపాడు.