Pooja Hegde | సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ల క్రేజీ ప్రాజెక్ట్ ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఐతే ఈ చిత్రంలో మొదట హీరోయిన్గా పూజా హెగ్డేని తీసుకున్నారు. కానీ ఏవో కారణాల వలన ఆమె ప్రాజెక్ట్ నుంచి బయటికివచ్చారు. పూజాకి చిత్ర యూనిట్ మధ్య ఏవో వివేధాలు వచ్చాయని, అందుకే ఆమెని తప్పించారని కొన్ని రూమర్స్ వినిపించాయి. ఐతే ఇప్పుడీ విషయంలో పూర్తిగా క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ.
‘‘మొదట ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేద్దామని అనుకున్నాం. తర్వాత 2024 పండక్కి మార్చాం. దీంతో మాకు మరింత సమయం దొరికింది. తొందరలేకుండా నెమ్మదిగా షూటింగ్ చేయాలనుకున్నాం. ఐతే అదే సమయంలో పూజా హెగ్డే మరో హిందీ మూవీలో నటించాల్సి వచ్చింది. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆమెను రీప్లేస్ చేశాం. అంతేగానీ ఇందులో ఎలాంటి సమస్యలు లేవు” అని చెప్పుకొచ్చారు నాగవంశీ.
ఇదే సమయంలో గుంటూరు కారం రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి పక్కా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు’ అన్నారు. అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి.