జనతాగ్యారేజ్ తరువాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ద్వితీయ చిత్రం ‘దేవర’. హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలైన ఈ చిత్రం రిలీజ్ రోజు మిక్స్డ్ రివ్యూస్‌ను తెచ్చుకుంది. అయితే రివ్యూస్‌తో, టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల విషయంలో దూకుడు ప్రదర్శించాడు దేవర. దేవర, వర రెండు పాత్రల్లో ఎన్టీఆర్ తన అభినయంతో ఆకట్టుకోవడంతో… ఎన్టీఆర్ వన్‌మ్యాన్ షోగా సినిమా అలరించింది. అంతేకాదు ప్రారంభ వసూళ్లలో కూడా దేవర మంచి రికార్డులనే సాధించింది.
విడుదల తరువాత వచ్చిన దసరా సెలవులు దేవరకు బిగ్గెస్ట్ అడ్వాంటేజీగా మారాయి. స్కూల్, కాలేజీలకు సెలవులు రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ దేవరను ఆదరించడం మొదలుపెట్టడంతో రెండోవారం కూడా సినిమా కలెక్షన్లు స్టడీగా వున్నాయి. కాగా ఈ చిత్రం విడుదలకు ఒకరోజు ముందే అర్థరాత్రి నుంచి ఏపీ, తెలంగాణలో బెనిఫిట్ షోస్‌కు అనుమతి లభించడంతో మిడ్నైడ్ షోస్ మొదలయ్యాయి. ఈ షోస్ నుంచే దేవరకు నెగెటివ్ టాక్ ప్రారంభమైంది.
ఇదే విషయాన్ని ఈ చిత్రాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులు సొంతం చేసుకున్న నాగ వంశీని లక్కీ భాస్కర్ ప్రెస్‌మీట్ లో ప్రశ్నించారు విలేకరులు.దీనికి ఆయన స్పందిస్తూ ” దేవర విషయంలో అర్థరాత్రి షోలు బెనిఫిట్‌గానే చెప్పాలి. ఎందుకంటే సినిమా విజయం సాధించింది. దేవర ఇది కొలిసొచ్చిన విషయమే. అయితే ఈ మిడ్నైట్ షోస్ వల్ల నాకు ఒక్క విషయంపై క్లారిటి వచ్చింది. అర్థరాత్రి ప్రదర్శనలకు వచ్చిన టాక్‌తో సంబంధం లేకుండా సినిమాలో కంటెంట్ వుంటే.. వాళ్లకు నచ్చితే సినిమాకు పెద్ద విజయాన్ని ఇస్తారు అనే విషయం అర్థమైంది.
అందుకే నా తాజా చిత్రం లక్కీ భాస్కర్ విడుదలకు ముందు రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే బెనిఫిట్ షోలు మొదలుపెడతాం’ అని తెలిపారు. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా రూపొందుతున్న లక్కీ భాస్కర్ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంలో ఈచిత్రం రూపొందుతుంది. అక్టోబర్ 31న ఈ చిత్రాన్నివిడుదల చేస్తున్నారు.