కథాబలమున్న మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ని నిర్మించినందుకు సంతృప్తిగా ఉందని నిర్మాత జయ్ పల్లందాస్ అన్నారు. ఆయన నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్టీరియస్’. రోహిత్, మేఘన రాజ్‌పుత్ జంటగా నటించారు. మహి కోమటిరెడ్డి దర్శకుడు. ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత జయ్ పల్లందాస్ మాట్లాడుతూ. వినూత్నమైన కథనం, ఉత్కంఠను కలిగించే సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా సాగుతుంది.
ఇందులోని ప్రతి పాత్ర అనుమానాస్పదంగా అనిపిస్తుంది. చివరిలో ఎవరూ ఊహించని రీతిలో కథ ముగుస్తుంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఉత్కంఠకు గురి చేస్తాయి. 150 థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నాం’ అని జయ్ పల్లందాస్ తెలిపారు.