Dil Raju | తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా (Ravi Gupta)తో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్డీసీ) ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు (Dil Raju) నేడు భేటీ అయ్యారు. వీరితో పాటు ఈ భేటీలో ఐఅండ్ పీఆర్ కమీషనర్ హరీష్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, పలువురు ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. దిల్ రాజు నిర్మిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సమావేశంలో సినిమా విడుదల, టికెట్ల రేట్లు పెంపు, బెనిఫిట్ షో అనుమతి సహా పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది.