అమర్దీప్, లిషి గణేశ్ కల్లపు జంటగా, సాయి వర్మ దాట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నా నిరీక్షణ’. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. అగ్ర నిర్మాత డి.సురేశ్‌బాబు ఆశీస్సులతో ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, నిర్మాత గణపతిరెడ్డి కెమెరా స్విచాన్ చేశారు.
నటుడు రాజా రవీంద్ర స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. ఈ సందర్భంగా అతిథులంతా చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. దర్శక, నిర్మాతలు ఏడు నెలలు సినిమా స్క్రిప్ట్మీద పనిచేశారని, తనను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్సని హీరో అమర్దీప్ అన్నారు. ఇంకా చిత్ర యూనిట్ మాట్లాడారు. చైతన్యవర్మ, రమ్యప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వి.రవికుమార్, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణం: పికాక్ మూవీ మేకర్స్.