బిగ్ బాస్ కార్యక్రమంలో నామినేషన్‌కి సంబంధించిన ప్రక్రియ చాలా హాట్‌గా నడిచింది. రవి.. మానస్, కాజల్‌లను నామినేట్ చేశాడు. లోబోకి నా గురించి చెడుగా చెప్పి మళ్లీ అది చెప్పడం నాకు నచ్చలేదు అని అన్నాడు. ఇక కాజల్‌ని నామినేట్ చేస్తూ.. ఎన్నిసార్లు నీతో కనెక్ట్ అవ్వాలనుకున్నా కుదరడం లేదని చెప్పాడు రవి. జెస్సీ.. సన్నీ, మానస్‌లను నామినేట్ చేశాడు. ప్రియాంక.. విశ్వ, రవిలను నామినేట్ చేసింది. ఆమె చెప్పిన కారణాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.
విశ్వని నామినేట్ చేస్తూ.. మీరు చాలా స్ట్రాంగ్.. ఫిజికల్ టాస్క్‌లో నువ్ ఉంటే నేను ఓటమికి గురౌతాననే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. రెండోదిగా రవిని నామినేట్ చేస్తూ.. రవి బాగా ఆలోచిస్తాడు.. అతని ఆలోచల్ని నేను అందుకోలేకపోతున్నా.. అందుకే ఓడిపోతాననే నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది ప్రియాంక. దీనిపై రవి.. ప్రియాంకకి గట్టిగా సూచనలు చేశాడు.అన్నగా చెబుతున్నా మరోసారి ఆలోచించుకో అన్నాడు.
స్ట్రాంగ్ అని చెప్పి నామినేట్ చేయడం కంటే వరస్ట్ మరోటి ఉండదు.. గుర్తు పెట్టుకో.. బాగా ఆడుతున్నానని ఇంటి నుంచి పంపించడం ఏంటి?? నా ఆలోచనకు నువ్ రాలేవన్న మాట.. అంటే నువ్ గేమ్ ఆడటం లేదు మాట అని ప్రియాంకను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు రవి. నువ్వు నేను ఫైనల్లో ఉంటే నువ్ నాపై గెలవలేవని అనుకుంటున్నావ్ కదా.. సరే వచ్చి నామినేట్ చేయి అని చెప్పాడు రవి. ఈ విషయంలో కొద్ది సేపు ఇద్దరి మధ్య హాట్ డిస్కషన్ నడిచింది.