Priyanka Jain | ప్రియాంక జైన్ అంటే వెంటనే ఆమె గుర్తు రాకపోవచ్చు. కాని బిగ్ బాస్ షోలో సందడి చేసిన ప్రియాంక జైన్ అంటే వెంటనే గుర్తు పడతారు. గతంలో సీరియల్స్‌లో నటించిన ప్రియాంక జైన్ బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ప్రియుడు శివ్ కుమార్ తో కలిసి యూట్యూబ్ లో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తుంటారు. కొన్ని సార్లు వారు విమర్శల బారిన పడుతుంటారు. వ్లాగ్స్ పేరుతో జనాలని మీరు పిచ్చోళ్లని చేస్తున్నారా అంటూ కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే ప్రియాంక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు గ్లామర్ ఫొటోలు కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంటుంది.
అయితే ప్రియాంక జైన్ ఎప్పుడు హద్దులు దాటలేదు. డ్రెస్ విషయంలో కాస్త రిజర్వ్డ్గానే ఉండేది. అయితే భారీ అంచనాలతో డ్యాన్స్ ఐకాన్ 2 షోలో అడుగుపెట్టిన ఈ భామ టాలెంట్ మాములుగా చూపించలేదు. బిగ్‌బాస్ షోలో కూడా కాస్త పద్ధతిగానే కనిపించిన ప్రియంక ఓటీటీ షో అనగానే హద్దులు చెరిపేసింది. ఈ ఎపిసోడ్ కోసం ప్రియాంక వేసిన ఔట్ఫిట్ మాములుగా లేదు. క్లీవజ్ షోతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసింది. జాలీల డ్రెస్‌తో కాస్త కవర్ చేసిన అందాలన్ని క్లియర్‌గా కనిపిస్తున్నాయి. మరోవైపు థైస్ షోతో పిచ్చెక్కించింది. ప్రియాంక ఈ రేంజ్ గ్లామర్ షో చేస్తుందని ఎవరు ఊహించలేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఆహాలో ప్రసారం అవుతున్న ఐకాన్ 2 షోలో ముమైత్ అడుపెట్టడంతో ఇప్పుడు ముమైత్ వర్సెస్ ప్రియాంక అన్నట్టుగా మారింది. ముమైత్ ఖాన్ సహా ఆమె కంటెస్టెంట్‌ని నామినేట్ చేస్తున్నట్లు ప్రియాంక చెప్పింది. కారణం ఏంటని అడగ్గా, ఏదో ఒక కారణం అలా చెప్పేసింది. మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చారు కనుక నామినేషన్స్‌కి వెళ్లి ప్రూవ్ చేసుకుంటే మీ స్ట్రెంథ్ మరింత పెరుగుతుంది అంటూ ఓ కారణం చెప్పింది. సరైన రీజన్ లేకే పిచ్చి కారణాలు చెబుతున్నావ్ అని ముమైత్ ఫైర్ అయింది. నేను మిమ్మల్ని మేమ్ అంటూ గౌరవంగా పిలుస్తుంటే మీరేంటి అరుస్తున్నారు అంటూ ప్రియాంక కౌంటర్ ఇచ్చింది. నువ్వు మేమ్ అని పిలుస్తూ అందరి ముందు భలే నటిస్తున్నావ్.. నీ గురించి నాకు తెలుసు.. డ్యాన్స్ షోలో డ్యాన్స్ మాత్రం చేస్తే చాలు.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడకు అంటూ రెచ్చిపోయింది ముమైత్. ఆమె మాటలకి ప్రియాంక బిత్తరపోయింది. ప్రోమో వీడియో నెట్టంట తెగ వైరల్ అవుతుంది.