బిగ్ బాస్ సీజన్ 5లో గురువారం రోజు కూడా కెప్టెన్ కంటెండర్ టాస్క్ కంటిన్యూ అయింది. హీరోలు , విలన్స్ అంటూ ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోగా, హీరోల టీమ్ నుంచి ఒకరిని టార్గెట్ చేసే ఛాన్స్ విలన్స్‌కు వచ్చింది. దీంతో వారు ప్రియాంక సింగ్‌ని ఎంచుకున్నారు.ఆమెకు నరకం ఏంటో చూపించారు విలన్ టీమ్. చెప్పివన్నీ చేసిన ప్రియాంక టాస్క్‌లో గెలుపొందింది.
బుధవారం నాడు శ్రీరామచంద్ర, యాంకర్ రవిలు టాస్కులు పూర్తి చేశారు. గురువారం రోజు ప్రియాంక టాస్క్‌లో పాల్గొంది. గుడ్డు అంటే పడని పింకీకి పచ్చి గుడ్డు రసాన్ని ఇచ్చారు .దానిని గడగడ తాగేసింది. పేడనీటితో స్నానం చేసింది. వాసన చూస్తేనే వాంతింగ్ వచ్చే మరో జ్యూస్‌ను తాగింది. ఉల్లిపాయ అంటేనే నచ్చకపోయినా టాస్క్ కోసం దాన్ని కరకరా నమిలేసింది. ఇక సిరి కత్తెర తీసుకొచ్చి జుట్టు కత్తిరించుకోమని చెప్పింది.
కాసేపు ఆగిన ప్రియాంక… తాను రెండు విషయాలు చెప్పింది. జుట్టు అంటే నాకు ప్రాణం, దాన్ని చూసుకునే బతుకుతున్నాను.. ఇవ్వమంటే క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఇస్తాను అని చెప్పిన ప్రియాంక కట్ చేసుకునేందుకు కూడా సిద్ధమైంది. దీనికి సిరి మేము అంత క్రూయల్ కాదులే అంటూ కత్తెర అందుకుంది. అయితే సిట్ అప్స్,బకెట్‌ని చేతులతో పట్టుకోవడంఇలా అన్ని చేసి హీరోస్ టీంకి ఒక పాయింట్ తెచ్చిపెట్టింది.