గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కొద్ది రోజుల క్రితం వరకు లండన్‌లో షూటింగ్స్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక షూటింగ్స్ పూర్తి కావడంతో తన ఫ్యామిలీతో కలిసి సరదా టైం స్పెంట్ చేయడంతో పాటు తాజాగా వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌కు హాజరయ్యింది.
శనివారం అశ్లిగ్ బార్టీ, కరోలినా ప్లిస్కోవా మధ్య జరిగిన వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌లో ప్రియాంక చోప్రాతో పాటు హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్, డేమ్ మాగీ స్మిత్ సందడి చేశారు. అయితే అందరి దృష్టి ప్రియాంక చోప్రాపై పడింది. హై నెక్, ఫుల్ స్లీవ్ వైట్ ఫ్లోరల్ డ్రెస్ ధరించిన ప్రియాంక తన వెంట ట్యాన్ బ్యాగ్ కూడా తెచ్చుకుంది.
డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేట్ మిడిల్టన్, ప్రిన్స్ విలియం దంపతులతో కలిసి ప్రియాంక మ్యాచ్ వీక్షించగా ఆ పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ప్రిన్స్ విలియం భార్య కేట్ మిడిల్టన్ ప్రియాంక స్నేహితురాలు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రియాంక ‘సిటాడెల్’ థ్రిల్లర్ సిరీస్, ‘టెక్స్ట్ ఫర్ యు’, ‘మ్యాట్రిక్స్ 4’ సహా పలు హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ అమ్మడు ఇటీవల సోనా అనే రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేసి అందులో తన ఫ్రెండ్స్‌తో కలిసి లంచ్ చేసింది.