నిరీక్షణకు దక్కిన ఫలితం

ఇరవైఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నానని చెప్పింది గ్లోబల్‌స్టార్ ప్రియాంకచోప్రా. కెరీర్ ఆరంభంలో తాను నటించిన చాలా సినిమాలు దారుణమైన పరాజయాల్ని చవిచూశాయని గుర్తుచేసుకుంది. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కెరీర్‌ను అనుకున్న విధంగా తీర్చిదిద్దుకున్నానని పేర్కొంది. ఓ అంతర్జాతీయ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘కెరీర్ తొలిరోజుల్లో నేను నటించిన కొన్ని సినిమాల్ని ఎవరూ చూసేవారు కాదు. నా పేరు కూడా ఎక్కడా వినిపించలేదు. అయినా నేను ఏనాడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ తర్వాత కమర్షియల్‌గా కొన్ని విజయాలు సాధించిప్పనటికీ మనసుకు నచ్చిన కథల్ని ఎంచుకోలేకపోతున్నాననే అసంతృప్తి ఉండేది. పదేళ్ల నుంచి కెరీర్లో గొప్ప మార్పువచ్చింది. కథాంశాలు, పాత్రలపరంగా అనేక ప్రయోగాలు చేసే అవకాశం దక్కింది. హాలీవుడ్లో అడుగుపెట్టడం నా జీవితగమనాన్ని మార్చివేసింది. ప్రస్తుతం నేను కోరుకున్న స్థానాన్ని ఆస్వాదిస్తున్నా. అయితే నాకు ప్రత్యేక లక్ష్యాలంటూ ఏమీ లేవు. గమ్యం కంటే జీవిత గమనాన్నే నేను ఎక్కువగా ఇష్టపడతాను’ అని తాత్విక ధోరణిలో చెప్పింది. ప్రస్తుతం ఆమె హాలీవుడ్లో మ్యాట్రిక్స్-4, టెక్ట్స్ ఫర్ యూ చిత్రాలతో పాటు ‘సిటాడెల్’ పేరుతో ఓ సిరీస్‌లో నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

