Priyanka Chopra | డీప్ ఫేక్ వీడియోలు దేశానికే పెద్ద సమస్యగా మారాయి. సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకూ చాలామంది వీటి బారిన పడుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది. ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ వీటి బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పడు బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా వంతు వచ్చింది. ఆమె డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. ప్రియాంక పాత వీడియోలో ఆమె వాయిస్ మాత్రం మార్చేసి, తాను ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు లిప్‌సింక్ చేశారు.
ఆ బ్రాండ్ వల్ల తన వార్షిక ఆదాయం బాగా పెరిగిందని, కాబట్టి అందరూ దాన్ని వాడాలని ప్రియాంక చెబుతున్నట్టు ఆ వీడియోను క్రియేట్ చేశారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. ‘నేను ఏ బ్రాండ్నీ ప్రమోట్ చేయలేదు. ఇది నిజంగా దారుణం. నా వీడియోలో వాయిస్‌ని మార్చేసి, నేనే చెబుతున్నట్టు తయారు చేసి విడుదల చేశారు. దయచేసి ఈ వీడియోను నమ్మొద్దు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. లేకపోతే ముందుముందు చాలా దారుణాలు చూడాల్సొస్తుంది.’ అంటూ వాపోయింది ప్రియాంక.