న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా.. తాజాగా కోవిడ్ బూస్టర్ టీకా డోసు తీసుకున్నది. లండన్, స్పెయిన్లో షూటింగ్ పూర్తి చేసుకుని ఇటీవల ప్రియాంకా లాస్ ఏంజిల్స్ చేరుకున్నది. అక్కడ కోవిడ్ బూస్టర్ టీకా తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. కారులో కూర్చుని బూస్టర్ డోసు తీసుకున్న ఓ ఫోటోను ఆమె పోస్టు చేసింది. అందరూ టీకా వేసుకోవాలని ఆమె తన అభిమానుల్ని కోరింది. ప్రస్తుతం సిటాడెల్ సిరీస్ షూటింగ్లో ప్రియాంకా చోప్రా పాల్గొంటోంది. ఇండియా, ఇటలీ, మెక్సికోల్లో సిరీస్ షూట్ చేయనున్నారు. రూసో బ్రదర్స్ దీన్ని డైరక్ట్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఆ సిరీస్ను రూపొందిస్తోంది.