MBNR Jobs | గవర్నమెంట్ మెడికల్ కాలేజీ (GMC), మహబూబ్‌నగర్ 2026 రిక్రూట్మెంట్లో భాగంగా ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 149 జూనియర్ రెసిడెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేయనున్నది. వీటికి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. అర్హులు, అనుభవం ఉన్నవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఖాళీలు
ప్రొఫెసర్ 8, అసోసియేట్ ప్రొఫెసర్ 19, అసిస్టెంట్ ప్రొఫెసర్ 62, ట్యూటర్ 10, జూనియర్ రెసిడెంట్ (JR) 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, పీడియాట్రిక్స్, డీవీఎల్, సైకియాట్రీ, రెస్పిరేటరీ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, ఆప్తాల్మాలజీ, ఓబీజీ, అనస్థీషియాలజీ, రేడియో డయాగ్నసిస్, ఎమర్జెన్సీ మెడిసిన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగాల్లో ఉన్నాయి.
అర్హతలు, వయోపరిమితి
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. సీనియర్ పోస్టులకు బోధన లేదా పరిశోధనలో అనుభవం ఉండాలి. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC)లో రిజిస్టర్ అయి ఉండాలి. ఇతర రాష్ట్రాలవారు అయితే ఎంపికైన వారం రోజుల్లోగా రిజిస్టర్ చేయించుకోవాలి. వయసు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 69, ట్యూటర్, జూనియర్ రెసిడెంట్లకు 45 ఏండ్లలోపు ఉండాలి.

Faculty
ఎంపిక
అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, జేఆర్లకు పీజీ (ఎండీ/ఎంఎస్/డీఎన్బీ) లేదా ఎంబీబీఎస్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రొఫెసర్/అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు వారి బోధన అనుభవం ఎంపిక చేస్తారు. స్థానిక అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు జీతం ప్రొఫెసర్‌కు రూ. 1,90,00, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ. 1,50,00, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ. 1,25,00, ట్యూటర్కు రూ. 55,000, జేఆర్‌కు రూ. 46,000 ఇస్తారు.
దరఖాస్తు
అర్హులైన అభ్యర్థులు వెబ్సైట్ www.gmcmbnr-ts.org నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. నింపిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు జిరాక్స్ సెట్లు తీసుకుని ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, ఏదిర క్యాంపస్, తిరుమల హిల్స్, మహబూబ్‌నగర్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ఇంటర్వ్యూకు చివరితేదీ సెప్టెంబర్ 15. ఫలితాలు సెప్టెంబర్ 17న వెల్లడిస్తారు. సెప్టెంబర్ 30 లోగా విధులకు హాజరు కావాలి.