లాస్ ఏంజిల్స్: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) ఏ పండగైనా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇక దివాళీ వేడుకల్ని ఆమె ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. భర్త నిక్ జోనాస్‌తో కలిసి లాస్ ఏంజిల్స్‌లోని ఇంట్లో ప్రియాంకా దివాళీ పండుగలో మునిగితేలింది. పండుగకు చెందిన ఆల్బమ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిందామె. ప్రియాంకా కుమార్తె మాల్తీ మారి ఫోటోలను కూడా ఆ ఆల్బమ్‌లో పోస్టు చేశారు. తల్లి మధు చోప్రా కూడా కొన్ని ఫోటోలో కనిపించారు. హ్యాపీ దివాళీ మెసేజ్ కూడా చేసింది ప్రియాంకా. కానీ మెసేజ్ కొద్దిగా లైట్ అయినట్లు చెప్పింది.
ప్రియాంకా చోప్రా పోస్టు చేసిన దివాళీ ఆల్బమ్ ఫోటోలకు తెగ లైక్‌లు వచ్చేస్తున్నాయి. భర్త నిక్ జోనాస్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో దివాళీ ఫోటోలను అప్లోడ్ చేశాడు. తన ప్రేమికురాలితో దివాళీ వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు నిక్ తెలిపాడు. సరోగసీ ద్వారా ప్రియాంకా జంట పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 2017 మెట్‌గాలా ఫ్యాషన్ ఈవెంట్లో కలుసుకున్న ఇద్దరు.. 2018లో ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో పెళ్లి చేసుకున్నారు.
హాలీవుడ్ మూవీ మ్యాట్రిక్స్ 4లో చివరిసారి ప్రియాంకా చోప్రా కనిపించింది. ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ చిత్రంలో నటిస్తోంది. 2023 వాలెంటైన్ డే రోజున ఆ ఫిల్మ్ రిలీజ్‌కానున్నది. సిటాడెల్ చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది. జీ లే జారా బాలీవుడ్ ఫిల్మ్ కూడా చేస్తోందామె.