Priyanka Arul Mohan | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). అరుణ్ మథేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ టీజర్ రానే వచ్చింది. ధనుష్ విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్‌గా గన్ చేతబట్టి యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్న విజువల్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్‌కే పరిమితమైన ప్రియాంకా మోహన్ ఈ సారి రూటు మార్చేసింది.
లేడీ మిల్లర్‌గా పిస్తోల్ చేత బట్టి తిరుగుబాటు చేస్తున్న స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఊహించని పాత్రలో కనిపిస్తున్న ప్రియాంక లుక్ చూసి స్టన్ అవుతున్నారు అభిమానులు, ఫాలోవర్లు. మొత్తానికి ఇక నుంచి తనను యాక్షన్ సినిమాల్లో కూడా చూడొచ్చని చెప్పకనే చెబుతోంది ప్రియాంకా మోహన్. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivarajkumar) కీలక పాత్రలో నటిస్తున్నాడు. సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన కెప్టెన్ మిల్లర్ లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కెప్టెన్ మిల్లర్ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ సొంతం చేసుకుంది. స్పూర్తితో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మూడు పార్టులుగా రాబోతున్నట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ధనుష్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో డీ50వ (D50) సినిమా చేస్తున్నాడు. D50 షూటింగ్ ఇటీవలే షురూ అయింది. ఇందులో ధనుష్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. కాళిదాస్, దుషారా విజయన్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ధనుష్ హిందీలో Tere Ishk Meinలో నటిస్తున్నాడు. మరోవైపు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆనంద్ ఎల్ రాయ్, ధనుష్ కాంబోలో రాబోతున్న మూడో సినిమా ఇది.
కెప్టెన్ మిల్లర్ టీజర్..