Balakrishna | చాలా కాలం తర్వాత ‘అఖండ’తో భారీ విజయాన్ని సాధించాడు నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలయ్య అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చింది. ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ పొలిటికల్ మాస్ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ‘అన్నగారు’ అనే టైటిల్ను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం తర్వాత బాలయ్య, అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఇప్పటికే దర్శకుడు అనిల్ ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ చిత్రంలో బాలయ్య 45ఏళ్ళ వయసు గల తండ్రి పాత్రలో నటించనున్నట్లు.. ఈ చిత్రం తండ్రి, కూతురు ఎమోషన్తో సాగుతున్నట్లు తెలిపాడు. ఇందులో బాలయ్య కూతురుగా ‘పెళ్ళిసందD’ Actress Sree Leela నటించనుంది. Actress Photo Gallery
ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా మెహరీన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రియమణి నటించనున్నట్లు టాక్. ‘నారప్ప’లో సందరమ్మగా ప్రియమణి ఒదిగిపోయిన తీరు నచ్చి అనిల్ ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా ప్రియమణిని ఎంపిక చేయాలని భావిస్తున్నాడట. ఇప్పటికే మేకర్స్ ప్రియమణితో సంప్రదింపులు కూడా జరిపారట. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. Telugu cinema news