బుధవారం 03 జూన్ 2020
Cinema - May 01, 2020 , 14:32:38

మ‌హేష్ స‌ర‌స‌న వింక్ బ్యూటీ..!

మ‌హేష్ స‌ర‌స‌న వింక్ బ్యూటీ..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌దుప‌రి చిత్రం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంద‌ని ఓ క్లారిటీ అయితే వ‌చ్చింది. కాక‌పోతే హీరోయిన్స్ విష‌యంలో అనేక భామ‌ల పేర్లు ప్ర‌చారం లోకి వ‌స్తున్నాయి. జాన్వీ క‌పూర్, సారా అలీ ఖాన్, కీర్తి సురేష్ ఇలా ప‌లువురు భామ‌ల పేర్లు చెప్పుకొస్తున్నారు. తాజాగా వింక్ బ్యూటీ ఫ్రేములోకి వ‌చ్చింది.

క‌న్నుగీటుతో కోట్లాది మంది హృదయాల‌ని గెలుచుకున్న ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ .. మ‌హేష్ 27వ చిత్రంలో క‌థానాయిక‌గ ఎంపికైందని స‌మాచారం. ఇప్ప‌టికే ఆమెతో చ‌ర్చ‌లు కూడా జ‌రిపన‌ట్టు స‌మాచారం. ఇదే క‌నుక నిజ‌మైతే ప్రియా ప్ర‌కాశ్ న‌క్క తోక తొక్కిన‌ట్టే అని అంటున్నారు. ఇప్ప‌టికే ప్రియా ప్ర‌కాశ్..తెలుగులో నితిన్ స‌ర‌స‌న ఓ సినిమా చేస్తుంది. 


logo