కొట్లాటలు, గొడవలు, కోపాలు అనేవి బిగ్ బాస్ హౌజ్ వరకే. ఆ తర్వాత అందరం స్నేహితులమే అని పలుమార్లు నిరూపించారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. గెట్ టు గెదర్ పేరుతో ఒకరిని ఒకరు కలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆర్టిస్ట్ ప్రియా ఇంట జరిగిన పెళ్లి వేడుకలో సందడి చేశారు. తాజాగా ప్రియకు వరుసకు కూతురయ్యే లోహిత పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలకు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు జెస్సీ, ఉమాదేవి, సరయు విచ్చేశారు.
పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ మధ్య నటరాజ్ ఇంట జరిగిన సీమంతం వేడుకలలోను వీరు సందడి చేసారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఏదేమైన బిగ్ బాస్ హౌజ్‌లో ఎంత ఫైటింగ్ చేసిన బయట మాత్రం సరదాగా కలిసిపోవడం అభిమానులని సంతోషింపజేస్తుంది.
ఇక బిగ్ బాస్ ప్రియ విషయానికి వస్తే..ఆమె చేసిన అల్లరి, పెట్టుకున్న గొడవలు, క్రియేట్ చేసిన వివాదాలు అందరికీ తెలిసిందే. సన్నీతో గొడవలు, లహరి రవి ఇష్యూ, విశ్వ, లోబోలతో వాగ్వాదాలు ఇలా ఎన్నెన్నో ఆమె జర్నీలో ఉన్నాయి. అయితే వెళ్లే ముందు మాత్రం అన్నీ క్లియర్ చేసుకునే వెళ్లింది. సన్నీకి ప్రేమగానే వీడ్కోలు పలికింది.