Satyadev-Dhanajaya Movie | ఓ వైపు హీరోగా రాణిస్తూనే, మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు సత్యదేవ్. ఇటీవలే ఈయన ప్రతినాయకుడి పాత్రలో నటించిన ‘గాడ్‌ఫాదర్’ విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో చిరుకు పోటీగా నటించి గొప్ప ప్రశంసలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ఒకటి. ఈ సినిమాలో ‘పుష్ప’ సినిమాలో జాలిరెడ్డి పాత్రలో నటించిన ధనంజయ మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. కాగా చిత్రబృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను ప్రకటించింది. ఈ చిత్రంలో చినబాబు, తిరు ఫేమ్ ప్రియాభవాని శంకర్ హీరోయిన్గా నటించనున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పతాకంపై బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. కాగా సత్యదేవ్‌కు, ధనంజయకు ఈ చిత్రం 26వది కావడం విశేషం. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
.@OldTownPictures Prod No.1 Welcomes the charismatic and highly talented actress @priya_Bshankar Aboard ❤️🔥
Shoot in progress🎬#SatyaDev26 #Dhananjay26@ActorSatyaDev @Dhananjayaka @EashvarKarthic @mk10kchary @charanrajmr2701 @anilkrish88 @BalaSundaram_OT #DineshSundaram pic.twitter.com/Jdl1ZoQ5NG
— Old Town Pictures (@OldTownPictures) October 15, 2022