Varanasi | దిగ్గజ దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం వారణాసి. ఈ సినిమాకు కేఎల్ నారాయణ దర్శకత్వం వహిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీత అందించబోతున్నాడు. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విలన్‌గా కుంభ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఇటీవలే ఈ మూవీ గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఈవెంట్‌ను జరుపుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇందులో పాడిన పృథ్వీరాజ్‌కి సంబంధించిన ‘రణ కుంభ’ పాటను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ‘ప్రళయం ప్రళయం’ అంటూ సాగే ఈ పాట గూస్బంప్స్ తెప్పించేలా ఉంది.