Rajamouli – Mahesh Project | ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహేశ్ – రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో ప్రియంకా చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు టాక్.
అయితే రాజమౌళి ప్రాజెక్ట్‌పై పృథ్వీరాజ్‌ను ఎప్పుడు అడిగిన ఆ విషయంను దాటవేస్తున్న వేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై స్పందించాడు పృథ్వీరాజ్. తాను రాజమౌళి ప్రాజెక్ట్ కోసం గత ఏడాది నుంచే పనిచేస్తున్నట్లు తెలిపాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఎల్2 ఎంపురాన్(L2 Empuraan). బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ (Lucifer) సినిమాకి ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తుంది. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మంజు వారియర్ (Manju Warrier), టోవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు పృథ్వీరాజ్. అయితే ఇందులో భాగంగానే రాజమౌళి ప్రాజెక్ట్ గురించి స్పందించాడు.
రీసెంట్గా రాజమౌళి సినిమాకు సంబంధించిన లీక్ వీడియో గురించి పృథ్వీరాజ్ స్పందిస్తూ.. లీక్ అయిన వీడియోలను చూడడానికి ప్రేక్షకులు ఎందుకు ఆసక్తి చూపిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అందులో ఏం ప్రత్యేకత ఉంటుంది? అలా చూస్తే సినిమా పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. పెద్ద స్క్రీన్ మీద ఆ సన్నివేశాలను పూర్తిగా ఆనందించలేరు. రాజమౌళి (SS Rajamouli) సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీని గురించి ఇప్పుడు ఏమీ చెప్పలేను. త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి టీమ్ నుంచి అధికారిక అప్డేట్స్ వస్తాయని ఆశిద్దాం. నేను ఈ సినిమాలో గత ఏడాది నుంచి పాల్గొన్నాను. అప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నాం. అంటూ పృథ్వీరాజ్ చెప్పుకోచ్చాడు.