రాజమౌళి, మహేశ్బాబుల సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి ఏదోఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనేవుంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో అంశాన్నీ దశలవారీగా రివీల్ చేస్తూ.. ఓ స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఇందులో విలన్గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒడిశాలో జరిగిన షెడ్యూల్లో పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ విజువల్స్ అనుకోకుండా వైరల్ అయ్యాయి కూడా. అయితే.. ఇందులో మెయిన్ విలన్ పృథ్వీరాజేనా? ఇంకెవరైనా ఉన్నారా? అనేది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నలుగుతున్న ప్రశ్న. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెయిన్ విలన్ పృథ్వీరాజ్ కాదట.
మహేశ్తో తలపడే అసలు విలన్ ఓ నల్లజాతీయుడని సమాచారం. పైగా అతను పలు హాలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలు కూడా పోషించారట. త్వరలో ఆయన పేరును రాజమౌళీనే స్వయంగా రివీల్ చేస్తారని తెలుస్తున్నది. ఇది ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథ కావడంతో.. విలన్గా నల్ల జాతీయుడు ఉంటేనే కరెక్ట్ అని రాజమౌళి భావించారట. ‘బాహుబలి’లో కాలకేయుడు.. ‘విక్రమార్కుడు’లో టిట్లా పాత్రలు ఎంత పాపులర్ అయ్యాయో అంతకు మించి ఈ పాత్ర ఉంటుందని ఇన్సైడ్ టాక్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.