Kaduva Movie On OTT | మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ పేరు ఈ మధ్య బాగా వినబడుతుంది. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ రంగంలో పలు విభాగాల్లో పనిచేస్తూ మాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే ఈయన నటించిన కడువా పాన్ ఇండియా లెవల్లో విడుదలై ఘన విజయం సాధించింది. షాజీ కైలాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 7న విడుదలై అన్ని భాషల్లో డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ సిద్ధమైంది.
ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్టు 4నుండి అన్ని భాషల్లో విడుదల కానుంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పృథ్విరాజ్‌కు జోడీగా భీమ్లానాయక్ హీరోయిన్ సంయుక్త మీనన్ నటించింది. వివేక్ ఓబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌తో కలిసి పృథ్విరాజ్ ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జిను వి.అబ్రహం కథ అందించాడు.
Prithviraj’s latest blockbuster #Kaduva premieres on Amazon Prime, August 4th. pic.twitter.com/fY5KwA8Hsz
— LetsOTT Global (@LetsOTT) July 29, 2022