Prithviraj Sukumaran | ఇటీవలే మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)కు గాయాలైన విషయం తెలిసిందే. విలయత్ బుద్ధ (Vilayath Buddha) చిత్ర షూటింగ్లో భాగంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా.. మోకాలికి గాయమైంది. దీంతో చిత్రయూనిట్ ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అయితే తమ అభిమాన హీరోకు గాయమైందని తెలియడంతో ఆందోళన చెందుతున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితిపై పృథ్విరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చాడు.
నా మోకాలికి ముఖ్యమైన సర్జరీ అయింది. ప్రస్తుతం కోలుకుంటున్నా. అయితే రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. త్వరగా కోలుకుని మళ్లీ యాక్షన్లోకి దిగుతానని సందేశాన్ని పోస్ట్ చేశాడు పృథ్విరాజ్ సుకుమారన్. తన ఆరోగ్యం కోసం దేవుడిని ప్రార్థించిన అభిమానులు, శ్రేయోభిలాషులు ధన్యవాదాలు తెలియజేశాడు. పోలీస్ పోలీస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పృథ్విరాజ్ సుకుమారన్.
ఈ స్టార్ హీరో జనగణమన సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సలార్ (Salaar )లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తోన్న మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Thank you 🙂❤️🙏 pic.twitter.com/SmfwzkKdfa
— Prithviraj Sukumaran (@PrithviOfficial) June 27, 2023