ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas). ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో ఒకటి సలార్ (Salaar). కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్టార్ డైరెక్టర్ కమ్ హీరో కొత్త అప్డేట్ అందించి మూవీ లవర్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు.
సలార్ వచ్చే నెలలో సలార్ కొత్త షెడ్యూల్లో జాయిన్ కాబోతున్నాడు. ఈ విషయాన్ని పృథ్విరాజ్ సుకుమారన్ వెల్లడించాడు. ప్రభాస్ రోల్ చాలా డిఫరెంట్ సాగబోతుందని, సలార్ నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగనుందని మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నాడు పృథ్విరాజ్ సుకుమారన్. ఇప్పటికే విడుదల చేసిన సలార్ మూవీ స్టిల్స్ లో ప్రభాస్ మాస్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.
ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కేజీఎఫ్ ప్రాంఛైజీ తెరకెక్కించిన విజయ్ కిరగందూర్ హోంబ్యానర్ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సలార్‌తోపాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కే, తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో మైథాలాజికల్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ చిత్రాలు కూడా చేస్తున్నాడు.