Sarzameen OTT |మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), బాలీవుడ్ నటి కాజోల్ (Kajol), సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ (Ibrahim Ali Khan) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సర్జమీన్’ (Sarzameen). కాయోజ్ ఇరానీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. దేశభక్తి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘జియో హాట్‌స్టార్’ (Jio Hotstar)లో ఈ సినిమా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా జియో హాట్‌స్టార్ సభ్యత్వం (Subscription) లేకుండానే ఉచితంగా అందుబాటులో ఉంచింది చిత్రయూనిట్. దీంతో ఈ వీకెండ్ సినిమా చూద్దామనుకున్నవారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కర్నల్ విజయ్ మీనన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉంటాడు. అదే స్ఫూర్తితో అతడి కుమారుడు హర్మన్ (ఇబ్రహీం) కూడా సైన్యంలో చేరాలని కలలు కంటాడు. అయితే నత్తితో బాధపడే హర్మన్ సైన్యానికి అనర్హుడని విజయ్ అభిప్రాయం. ఇదిలావుండగా.. ఒక రోజు హర్మన్ కిడ్నాప్ అవుతాడు. “మా వారిని విడిచిపెడితేనే.. నీ కొడుకును నీకు అప్పగిస్తాం” అంటూ ఉగ్రవాదులు బెదిరిస్తారు. ఈ విషయం తెలిసిన హర్మన్ తల్లి మెహర్ (కాజోల్), “కన్న కొడుకు కావాలో, దేశం కావాలో తేల్చుకో” అని విజయ్‌కు పరీక్ష పెడుతుంది. దానికి విజయ్, “దేశం తర్వాతే ఎవరైనా” అని సమాధానం ఇస్తాడు. మరి, ఉగ్రవాదుల చేతుల్లో హతమయ్యాడని భావించిన హర్మన్ ఎలా తిరిగి వచ్చాడు? అంతకాలం ఎక్కడ ఉన్నాడు? ఆ తర్వాత తల్లిదండ్రులతో అతడి ప్రవర్తన ఎలా మారింది? అసలు హర్మన్ టెర్రరిస్ట్‌గా మారాడని విజయ్ ఎందుకు అనుమానించాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘సర్ జమీన్’ కథ.
One family. One blood. Different sacrifices.
#Sarzameen now streaming, only on @JioHotstar!
#SarzameenOnJioHotstar pic.twitter.com/pJIGjc8iCq— Dharma Productions (@DharmaMovies) July 24, 2025