Prime Minister Modi | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ (94) ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గత శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అయితే కనకరత్నమ్మ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అల్లు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కనకరత్నమ్మ తన కళ్లను దానం చేయడం గొప్ప విషయం అని కొనియాడారు. ఈ దానం ద్వారా ఆమె అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. అల్లు కుటుంబానికి ఈ కష్ట సమయంలో తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ మోదీ సందేశం పంపారు. ప్రధానమంత్రి తెలిపిన సంతాప సందేశానికి అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు.