‘ఇండియన్-3’ కోసం కసరత్తులు
కమల్‌హాసన్-శంకర్ కాంబోలో రెండేళ్ల క్రితం వచ్చిన ‘ఇండియన్-2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన విషయం తెలిసింది. అయితే ఈ ఫ్రాంఛైజీలో మూడో భాగం కోసం దర్శకుడు శంకర్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘ఇండియన్-2’ షూటింగ్ సమయంలోనే మూడోభాగానికి సంబంధించిన మేజర్ పార్ట్‌ను చిత్రీకరించారని తెలిసింది.
కమల్‌హాసన్-శంకర్ కాంబోలో రెండేళ్ల క్రితం వచ్చిన ‘ఇండియన్-2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన విషయం తెలిసింది. అయితే ఈ ఫ్రాంఛైజీలో మూడో భాగం కోసం దర్శకుడు శంకర్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘ఇండియన్-2’ షూటింగ్ సమయంలోనే మూడోభాగానికి సంబంధించిన మేజర్ పార్ట్‌ను చిత్రీకరించారని తెలిసింది. కేవలం కొంత టాకీ పార్ట్ మాత్రమే మిగిలిఉందని, దానిని త్వరలో పూర్తి చేసే ఆలోచనలో దర్శకుడు శంకర్ ఉన్నారని చెబుతున్నారు.
కథానుగుణంగా మూడోభాగంలో గ్రాఫిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందట. గ్రాఫిక్స్ కోసమే చాలా సమయం తీసుకోబోతున్నారని తెలిసింది. ఈ ఫ్రాంఛైజీలో కమల్‌హాసన్ పోషించిన సేనాపతి పాత్ర మూడోభాగంలో మరింత శక్తివంతంగా మారుతుందని, వ్యవస్థలోని అవినీతి ప్రక్షాళన కోసం ఆయన పోరాటం కొత్త పంథాలో ఉంటుందని అంటున్నారు. ఈ మూడోభాగానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని చెన్నై సినీవర్గాల్లో వినిపిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

