సాత్విక్వర్మ, ప్రీతి నేహా జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమిస్తున్నా’. భాను దర్శకుడు. ఐబిఎం ప్రొడక్షన్స్ పతాకంపై కనకదుర్గారావు పప్పుల నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఇటీవల ఈ సినిమాలోని తొలిగీతాన్ని విడుదల చేశారు. దర్శకుడు భాను మాట్లాడుతూ..హృద్యమైన ప్రేమకథా చిత్రమిదని, నేటి యువతను ఆకట్టుకునే అన్ని అంశాలుంటాయని తెలిపారు.
రెగ్యులర్ లవ్స్టోరీస్కు భిన్నంగా ఆకాశమంత, అనంతమైన ప్రేమను ఆవిష్కరించే చిత్రమిదని, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని విభిన్న కథాంశంతో తెరకెక్కించామని, సంగీతప్రధానంగా ఆకట్టుకుంటుందని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: భాస్కర్ శ్యామల, సంగీతం: సిద్ధార్థ్ సాలూరి, దర్శకత్వం: భాను.