Court| హీరో నాని సొంత బ్యానర్ నుంచి వచ్చిన సినిమా కోర్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. ప్రియదర్శి .. హర్ష్ రోషన్ .. శ్రీదేవి ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమాకి, రామ్ జగదీశ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రేక్షకులకి మంచి వినోదం పంచింది. అయితే సినిమా రిలీజ్‌కి ముందే నాని ఈ సినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ సినిమా బాగోలేకపోతే, ఆ తరువాత రానున్న తన ‘హిట్ 3’ మూవీని చూడొద్దంటూ అందరి దృష్టిని ఈ సినిమా వైపుకు మళ్లించాడు.
కోర్ట్ మూవీ ఈ మూవీ కేవలం మౌత్ టాక్ తోనే అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది అని చెప్పాలి . ప్రీమియర్ షోల నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఈ సినిమా మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇక ‘కోర్ట్’ మొదటి రోజే రూ.8 కోట్ల పైగా వసూళ్లను రాబట్టగా, 5 రోజులు పూర్తయ్యేసరికి మొత్తం రూ.33.55 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు చిత్ర బృందం తెలియజేసింది. ఇప్పటివరకు తెలుగులో వచ్చిన కోర్ట్ రూమ్ డ్రామాలలో ఈ చిత్రం బెస్ట్ మూవీగా నిలిచింది. నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్‌కి మంచి లాభాలని తెచ్చిపెట్టింది. సినిమా బడ్జెట్ కంటే దాదాపుగా మూడు రెట్లు అధిక వసూళ్లు సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇక ఈ మూవీలోని కథలెన్నో చెప్పారు.. కవితల్ని రాసారు.. కాలాలు దాటారు.. యుద్దాలు చేసారు.. ప్రేమలో తప్పు లేదు ప్రేమలో అనే సాంగ్ పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సాంగ్‌ని ప్రమోషన్స్‌కి ఫుల్‌గా వాడేశారు.శ్రీదేవి, హర్ష్ రోషన్ అయితే ప్రతి ఈవెంట్లో ఈ పాటకి స్టెప్పులేశారు. చాలా మంది ఇదే పాటని రీల్స్ కూడా చేసి వైరల్ చేశారు. నాని సక్సెస్ మీట్లో ఈ పాటకి డ్యాన్స్ చేసి సందడి చేశాడు. ఇక అనీల్ రావిపూడి కూడా ఇదే పాటకి చిందులేశారు. మొత్తానికి ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. మీరు చూసి ఎంజాయ్ చేయండి.