కిశోర్ కేఎస్డీ, దియా సితెపల్లి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమకథ’. శివశక్తి రెడ్డి దర్శకుడు. విజయ్ మిట్టపల్లి, సుశీల్ వాజపిల్లి , శింగనమల కల్యాణ్ నిర్మాతలు. సంగీత దర్శకుడు రథన్ స్వరపరిచిన ఈ చిత్రం తొలిపాటను యువహీరో ఆనంద్ దేవరకొండ విడుదల చేశారు. ‘ఎవడు మనోడు.. ఎవడు పగోడు..’ అంటూ ప్రతీకార నేపథ్యంలో సాగే ఈ పాటను రాంబాబు గోసాల రాయగా, సీవీ సంతోశ్ ఆలపించారు.
సినిమా మంచి విజయం సాధించాలని ఆనంద్ దేవరకొండ ఆకాంక్షించారు. వైవిద్యమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్టు నిర్మాత తెలిపారు. త్వరలోనే సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు పెండెం.