విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. ఈ నెల 14న విడుదల కానున్నది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దర్శకులు బాబీ, సందీప్‌రాజ్, శైలేష్ కొలను, బీవీఎస్ రవి, నిర్మాత లగడపాటి శ్రీధర్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘సమాజంలో సంతానలేమి సమస్య ఎక్కువగా ఉంది. అందుకే ఫెర్టిలిటీ సెంటర్లు కూడా ఎక్కువయ్యాయి. సమస్యలు ఉన్న వాళ్లకు అవి అవసరం. కానీ అన్నీ ఉండి కూడా లైఫ్ ైస్టెల్ కారణంగా సంతానానికి దూరమవుతున్న జంటలను ఈ సినిమా ద్వారా ప్రశ్నించాం.
ఇది వినోదం, భావోద్వేగాలతో కూడిన ప్రేమకథ. అద్భుతమైన సందేశం కూడా ఉంటుంది’ అని దర్శకుడు సంజీవ్‌రెడ్డి తెలిపారు. ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనీ, కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని నిర్మాత మధుర శ్రీధర్ నమ్మకం వెలిబుచ్చారు. చర్చనీయాంశం కానీ సమస్య గురించి చర్చించి, పదుగురు చర్చించుకునేలా చేసే సినిమా ఇదని హీరోయిన్ చాందినీ చౌదరి చెప్పారు. సెన్సిటివ్ ఇష్యూని ఎంటర్టైన్మెంట్ మోడ్‌లో చెప్పిన మంచి ప్రయత్నం ఈ సినిమా అని హీరో విక్రాంత్ చెప్పారు. ఇంకా చిత్రబృందం అంతా మాట్లాడారు.