తెలుగు సినీరంగంలో నిర్మాతగా, దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ఆయన ‘ఉమెన్స్ కబడ్డీ’ పేరుతో కొత్త చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్పోర్ట్స్ ఎంటర్టైనర్గా తెరకెక్కించబోతున్నారు. స్వీయ దర్శక, నిర్మాణంలో ఆర్.కె.గౌడ్ నిర్మిస్తున్న ‘దీక్ష’ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.
జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ ‘దీక్ష’ చిత్రం చక్కటి సందేశంతో ఆకట్టుకుంటుందని తెలిపారు. అలాగే సినీరంగంలో తెలంగాణ కార్మికులు పనులు లేక అవస్థలు పడుతున్నారని, ఇక్కడి ప్రతిభావంతులకు అవకాశాలు ఇవ్వాలని కోరారు. ఎఫ్డీసీ, ఫిల్మ్ ఛాంబర్ కలిసి యాభైశాతం పనులను తెలంగాణ కార్మికులకు, మిగతా యాభైశాతం ఇతర ప్రాంతాల కార్మికులకు పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్.కె.గౌడ్ డిమాండ్ చేశారు.