ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘దీక్ష’. కిరణ్, అలేఖ్య రెడ్డి జంటగా నటించారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్కు మైథలాజికల్ అంశాలను జోడించి ఈ సినిమాను రూపొందించాం. కథానుగుణంగా ఐదు అద్భుతమైన పాటలు కుదిరాయి. భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఆక్సఖాన్, తులసి, అనూష తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.