Prashant Varma | ‘హనుమాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.. మరో కొత్త బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యాడు. నేడు హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్(PVCU) నుంచి ప్రత్యేకమైన ‘హనుమాన్ లిమిటెడ్ కలెక్షన్‌ను ఆవిష్కరించారు. భక్తి, ప్రేమతో రూపొందించిన ఈ ప్రత్యేకమైన దుస్తులను http://pvcu.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించాడు.
కలెక్షన్ ప్రత్యేకతలు:
ఈ లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్, హనుమంతుని పట్ల ఉన్న భక్తిని, ప్రేమను ప్రతిబింబించేలా తీర్చిదిద్దబడింది. ఈ ప్రత్యేకమైన వస్తువులు హనుమాన్ భక్తులకు మరింత దగ్గరవుతాయని, వారి ఆధ్యాత్మిక భావాలను వ్యక్తపరచడానికి ఉపయోగపడతాయని PVCU బృందం తెలిపింది.
ఎలాంటి వస్తువులు ఉన్నాయి?
ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో టీ-షర్టులు ఉండగా.. ఫ్యూచర్లో హూడీలు, ఇతర యాక్సెసరీస్ వంటివి ఉంటాయని భావిస్తున్నారు. హనుమాన్ భక్తులు మరియు ప్రత్యేకమైన, నాణ్యమైన మెర్చండైజ్ను కోరుకునేవారు ఇప్పుడే PVCU వెబ్సైట్ ద్వారా షాపింగ్ చేయవచ్చు. ఈ కలెక్షన్ ద్వారా పౌరాణిక గాథలను, ఇతిహాసాలను తమ దుస్తుల ద్వారా వ్యక్తీకరించే అవకాశం లభిస్తుంది. ప్రశాంత్ వర్మ సినిమాకు వచ్చిన విశేష స్పందన నేపథ్యంలో, ఈ ‘హనుమాన్ లిమిటెడ్ కలెక్షన్’కు కూడా భారీ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
With love & devotion, celebrating #HanumanJayanthi, we present our HanuMan Limited Collection ✨, now live at https://t.co/8AcwILrJil . May these pieces bring you closer to your heart 🙏 Shop now! ⏰#PVCUStore #HanuManMerch #wearPVCU #WeartheLegends @ThePVCU pic.twitter.com/PyDRnlFMnf
— Prasanth Varma (@PrasanthVarma) May 22, 2025