Prashanth Neel | ఇటీవల విడుదలైన ‘సలార్’ ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. అయితే.. ఈ ట్రైలర్‌కి ప్రశంసలతోపాటు విమర్శలు కూడా ఎదురవ్వడం చర్చనీయాశంగా మారింది. ఈ ట్రైలర్‌ని చూసిన కొందరు క్రిటిక్స్.. సినేరియా మొత్తం ‘కేజీఎఫ్’ తరహాలోనే ఉందని, కథ కూడా దాదాపు అలాగే ఉందని, దీన్ని ‘కేజీఎఫ్ 3’ అనుకోవచ్చని కొన్ని విమర్శలు గుప్పించారు. దీనిపై దర్శకుడు ప్రశాంత్‌నీల్ వివరణ ఇచ్చారు. ‘ ‘కేజీఎఫ్’కీ ‘సలార్’కీ అస్సలు సంబంధం ఉండదు.
‘కేజీఎ ఫ్’, ‘సలార్’ రెండు విభిన్న ప్రపంచాలు. ఆ రెండు ప్రపంచాలను కలపాలని కోరుకోను. అంత సామర్థ్యం కూడా నాకు లేదు. ప్రభాస్ అంత తేలిగ్గా కథను ఒప్పుకోరు. ఒక హిట్ సినిమాను కాపీ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన స్థాయి కూడా అది కాదు’ అని తెలియజేశారు ప్రశాంత్ నీల్. ఈ నెల 21న ‘సలార్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.