కన్నడ స్టార్ హీరోయిన్ ప్రణీత మన తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితమే. సెకండ్ హీరోయిన్గా నటించిన కూడా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. ఈ అమ్మడు నటనతోనే కాదు సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుచుకుంటుంది. కొవిడ్ మొదటి దశ మొదలైన దగ్గర్నుంచి పలు మార్లు పలు విధాలుగా ఆమె సహాయం అందించారు. తన టీంతో కలిసి నిత్యావసర సరుకులు అందించడమే కాక ఫుడ్ వండి మరి పంపిణి చేసింది.
ఇక సెకండ్ వేవ్‌లో ఆహారం కన్నా.. ఆక్సీజన్ ఎక్కువ అవసరమైందని తన చారిటీ ద్వారా ఆక్సీజన్ సిలిండర్లు కాన్సన్ట్రేటర్లు అందించారు. ఇక వ్యాక్సిన్ ఇప్పుడు అందరికి అవసరం కాబట్టి తన ఫౌండేషన్ ద్వారా ఉచిత వ్యాక్సినేషన్ అందిస్తుంది ప్రణీత. అస్టర్ అనే ఆసుపత్రిలో ఉచితంగా వ్యాక్సిన్ తీసుకోవొచ్చని సమీపంలో ఉన్నవారు వెళ్లి తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవలే ప్రణీత బెంగళూరు వ్యాపారవేత్త నితిన్ రాజును మే 31న ఆమె రహస్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ప్రణీత హిందీలో నటించి ‘భుజ్’ చిత్రం ఓటీటీలో విడుదల కాగా ‘హంగామా-2’ మూవీ విడుదల కావాల్సి ఉంది.
ಇಂದು @pranithafounda1 ವತಿಯಿಂದ, ಬೆಂಗಳೂರಿನ @Rashtrotthana_P yoga centre nalli 'ವ್ಯಾಕ್ಸಿನೇಷನ್ ಡ್ರೈವ್ ' ಆಯೋಜಿಸಲಾಗಿತ್ತು.
— Pranitha Subhash (@pranitasubhash) June 16, 2021
ಕಾರ್ಯಕ್ರಮದ ಕೆಲವು ಛಾಯಾಚಿತ್ರಗಳು ಇಲ್ಲಿವೆ… pic.twitter.com/O8F8m1JkuM