RRR | ‘ఆర్ఆర్ఆర్’లోని కొమ్మ ఉయ్యాల.. అంటూ పాట పాడిన గాయని ఎవరో తెలుసా?
ఇండియాలో ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' హవా నడుస్తుంది. ఏ థియేటర్లో చూసినా ట్రిపుల్ఆర్ బొమ్మే. చిత్రంలోని కొమ్మ ఉయ్యాల.. కోన జంపాలా పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
RRR Singer | ఇండియాలో ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ హవా నడుస్తుంది. ఏ థియేటర్లో చూసినా ట్రిపుల్ఆర్ బొమ్మే. జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. సౌత్ నుంచి నార్త్ వరకు కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. చరణ్, తారక్‌ల నటనను చూసేందుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవలే బాలీవుడ్లో వంద కోట్ల క్లబ్‌లోకి చేరి బాలీవుడ్ సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ చిత్రం ఎంత విజయం సాధించిందో, పాటలు కూడా అంతే విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని కొమ్మ ఉయ్యాల.. కోన జంపాలా పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ట్రిపుల్ఆర్ చిత్రంలో మల్లి అనే గిరిజన పాప ఈ పాటను ఆలపిస్తుంది. చిత్రానికి ముందు ఈ పాటను మేకర్స్ విడుదలచేయలేరు. థియేటర్‌కు వెళ్ళిన ప్రేక్షకులకు సర్ప్రైజ్గా ఈ పాట విపరీతంగా నచ్చేసింది. దాంతో ఈ పాట లిరికల్ సాంగ్‌ను విడుదల చేయాలని ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా మేకర్స్‌ను కోరుతున్నారు. ఈ పాట పాడింది ఎవరా అని గూగుల్‌లో తెగ సర్చ్ చేస్తున్నారు. అయితే ఈ పాటను ఆలపించిన చిన్నారి గాయని పేరు ప్రకృతి రెడ్డి. కర్ణాటకలోని బళ్ళారిలో పుట్టిన ప్రకృతి కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ పాటలు పాడుతుంది. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సింగింగ్ రియాలిటీ షోలల్లో కూడా పాల్గొంది. ప్రకృతి పలు రియాలిటీ షోలలో పాడిన పాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Read Also:
RRR Collections | బాక్సాఫీస్ దగ్గర ‘ఆర్ఆర్ఆర్’ దండయాత్ర.. ఫస్ట్ వీక్‌లో రికార్డు కలెక్షన్లు
Pawan Kalyan | ఆ యువ దర్శకుడితో వపన్ సినిమా చేయనున్నాడా?
Kriti Shetty | భారీగా పారితోషికాన్ని పెంచేసిన కృతిశెట్టి.. సూర్యతో సినిమాకు అన్ని కోట్లు తీసుకుందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం
AP News | మురసు ఎఫెక్ట్.. నెల్లూరు తీరం అల్లకల్లోలం.. సముద్రంలో చిక్కిన మత్స్యకారులు..!
Punjab: బీజేపీలో చేరిన ముగ్గురు పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు
Donald Trump | మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే మిస్టర్ వీటోగా మారుతా : డొనాల్డ్ ట్రంప్
Aadarsha Kutumbam | తొలి వారాంతంలోనే రూ.75 కోట్ల వసూళ్లు.. వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ బ్లాక్‌బస్టర్ !
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

