Agent Sai Srinivasa Athreya Sequel | ప్రస్తుతం ప్రేక్షకులలో సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. భారీ బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కించి అందులో ఆరు పాటలు, నాలుగు ఫైట్స్, రెండు ముద్దు సీన్లు ఉంటే చాలు హిట్టయిపోయితాయి అనుకుంటే పొరపడినట్టే. ప్రేక్షకులు ఇప్పుడు సినిమాలలో కొత్త విషయం ఎదైనా ఉందా అని ఆలోచించి థియేటర్లకు వెళ్తున్నారు. కంటెంట్ ఉంటే తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సినిమాలను కూడా భారీ హిట్లను చేస్తున్నారు. ఈ క్రమంలోనే అలా ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రాలలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఒకటి. నవీన్ పొలిశెట్టి హీరోగా స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి భారీ విజయాన్ని సాధించింది.
ఈ చిత్ర దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే లేటెస్ట్గా తెరకెక్కించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఇటీవలే చిత్ర ప్రమోషన్లలో భాగంగా స్వరూప్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సీక్వెల్ ఉంటుందని వెల్లడించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నామని, త్వరలోనే ఈ చిత్రం ప్రారంభంకానున్నట్లు వెల్లడించాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఏజెంట్ సినిమాలో నవీన్ పొలిశెట్టి డిటెక్టీవ్ పాత్రలో నటించాడు. దాదాపు 5కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం టోటల్ రన్లో 20కోట్ల వరకు కలెక్షన్లు సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్టును సాధించింది.
Read Also:
Kriti Shetty | భారీగా పారితోషికాన్ని పెంచేసిన కృతిశెట్టి.. సూర్యతో సినిమాకు అన్ని కోట్లు తీసుకుందా?
Radhe Shyam | ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఫైనల్ కలెక్షన్స్
Ghani | భారీ ధర పలికిన ‘గని’ నాన్-థియేట్రికల్ హక్కులు?
Pawan Kalyan | ఆ యువ దర్శకుడితో వపన్ సినిమా చేయనున్నాడా?