విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కొద్ది రోజుల క్రితం షూటింగ్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన చేతికి గాయం కాగా, విషయాన్ని ప్రకాశ్ రాజ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇక హైదరాబాద్‌లోనే ఆయన చేతికి సంబంధించిన సర్జరీ పూర్తి కాగా, డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కోలుకోవడంతో వైద్యులు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు.
ప్రకాశ్‌రాజ్‌కు వైద్యం అందించిన ప్రముఖ డాక్టర్ గురువారెడ్డి.. ప్రకాశ్‌రాజ్‌తో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. ‘నా స్నేహితుడు ప్రకాష్ రాజ్ డిశ్చార్జ్ అయిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆయన ప్రస్తుతం బావున్నారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. అతి త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై ప్రకాష్ రాజ్ ని చూడాలి’ అని గురువా రెడ్డి సోమవారం సాయంత్రం ట్వీట్ చేశారు. ఫొటోలో ప్రకాశ్ రాజ్ చేతికి కట్టు కనిపిస్తుంది.
ఇక ఈ రోజు తెల్లవారుఝామున చిరు ఇంటికి వెళ్లి ఆయన్ని జిమ్‌లో కలిసారు ప్రకాశ్ రాజ్. చిరుతో కలిసి జిమ్‌లో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. తెల్లవారుఝామున బాస్ ని జిమ్‌లో కలిసాను.సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిష్కారాల కోసం ఆయన చొరవ తీసుకోవడం సంతోషంగా ఉంది.మీరు ఎప్పుడు మాకు స్పూర్తి దాయకం అని ప్రకాశ్ రాజ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, మా ఎలక్షన్స్‌లో ప్రకాశ్ రాజ్ అధ్యక్షుడిగా పోటీ చేయనుండగా,ఆయనకు చిరు మద్దతు ఉన్నట్టు తెలుస్తుంది.