విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పని రాక్షసి అనేసంగతి మనందరికి తెలిసిందే. సినిమా కోసం నిద్రాహారాలు మాని పనిచేస్తుంటారు.ఆయన ఇటీవల ఓ షూటింగ్లో గాయపడగా, హైదరాబాద్ వచ్చి చికిత్స చేయించుకున్నారు. రీసెంట్గా డిశ్చార్జ్ కావడంతో డైరెక్ట్‌గా మెగాస్టార్ ఇంటికి వెళ్లి కలిసారు. జిమ్‌లో చిరుతో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. ఉదయాన్నే బాస్ తో జిమ్ లో సమావేశమయ్యాను. సినీ పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యలకు పరిష్కారం కోసం ఆయన చూపుతోన్న చొరవకు కృతజ్ఞతలు చెప్పానన్నారు.
సినీ పరిశ్రమలో చిరంజీవి వంటి వ్యక్తి మాకు దొరకడం ఓ వరం అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు.ఇక చిరుని కలిసిన తర్వాత చెన్నై వెళ్లిన ప్రకాశ్ రాజ్ అక్కడి నుండి కార్తీ, మణిరత్నంతో కలిసి గ్వాలియర్‌కు వెళ్లారు. అక్కడ జరుగుతున్న పొన్నియన్ సెల్వన్ షూటింగ్లో పాల్గొనేందుకు వెళ్లినట్టు ప్రకాశ్ రాజ్ తెలిపారు.
పొన్నియన్ సెల్వన్ నవలా ఆధారంగా ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. అదే నవల పేరుతో మణిరత్నం మ్యాజిక్ చేయబోతోన్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం కోలీవుడ్ మొత్తం కదిలి వస్తోంది. ఈచిత్రాన్ని మణిరత్నం, లైకా ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, విక్రమ్ ప్రభు, త్రిష, మోహన్ బాబు, ఐశ్వర్యా రాయ్ వంటి వారు నటిస్తున్నారు. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న యూనిట్.. కరోనా వల్ల కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక త్వరలోనే మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది.