Prakash Raj | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. గాంధీ జయంతిని పురస్కరించుకోని పవన్ విమర్శిస్తూ మరో పోస్ట్ పెట్టాడు. గత కొన్నిరోజుల నుంచి పవన్ కళ్యాణ్- ప్రకాశ్ రాజ్‌ల మధ్య ఎక్స్‌లో వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి లడ్డూ విషయంలో వీరిద్దరి మధ్య మొదలైన ఈ రచ్చ ఇంకా కోనసాగుతునే ఉంది. అయితే పవన్ కళ్యాణ్‌ను దేవుడిని రాజకీయల్లోకి లాగడంటూ తనకు సమయం దొరికినప్పుడల్లా విమర్శిస్తున్నాడు ప్రకాశ్ రాజ్. తాజాగా నేడు గాంధీ జయంతి సందర్భంగా కూడా మరోసారి విరుచుకుపడ్డాడు.
నేడు జాతిపిత మహాత్మా గాంధీతో పాటు, దేశ మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి. ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.. వాళ్లు చెప్పిన కొటేషన్స్ చెబుతూ పవన్‌పై కౌంటర్ వేశాడు. గాంధీ చెప్పిన ”నువ్వు మైనారిటీలో ఒకరివి అయిన.. నిజం అనేది ఎప్పటికి నిజమే” అనే కోట్తో పాటు. ”మనకు దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు ఉన్నాయి. కానీ వీటిని ఎప్పుడూ రాజకీయాల్లోకి తీసుకురాలేదు. ఇదే భారత్‌కు, పాకిస్థాన్‌కు మధ్య ఉన్న తేడా”.. అంటూ లాల్ బహుదూర్ శాస్త్రి చెప్పిన కోట్లను పోస్ట్ చేశాడు. దీనికి ఈ సత్యాన్ని మీ అందరిలోకి ఇంకిపోనివ్వండి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇక ఇది చూసిన నెటిజన్లు గాంధీ జయంతి నాడు కూడా ప్రకాశ్ రాజ్ బ్యాటింగ్ ఆపట్లేదు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Wishing you all happy #GandhiJayanti #LalBahadurShastriJayanti … Let this TRUTH sink into all of us 🙏🙏🙏 #justasking pic.twitter.com/AQV92znBHc
— Prakash Raj (@prakashraaj) October 2, 2024