యువతరం కథానాయకుడు, దర్శకుడు, రచయిత ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ‘పీఆర్ షో’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘డ్రాగన్’ దర్శకుడు అశ్వత్ మారిముత్తు, మమితా బైజు ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ది ఆల్ఫా యూనిట్(విశాల్ టీఆర్, యశ్.వి, నరేన్ సావోడా, చాణక్యన్.ఆర్, ధనుష్‌కుమార్, ఇలంపరిధి) ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించనున్నది. ఈ సినిమాను సోమవారం అధికారికంగా ప్రకటించారు. దీనికి కథకుడు కూడా ప్రదీప్ రంగనాథనే కావడం విశేషం. ఒకే సినిమాకు ఆరుగురు దర్శకత్వం వహించడం ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ వీడియో అంతా యూత్‌ఫుల్ వైబ్‌తో సాగింది. శివాజీ సొంటినేని, స్వసిక, అనామిక మహి, లిజ్జీ ఆంటోని ఇతర పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి కెమెరా: దినేష్ పురుషోత్తమన్, సంగీతం: సాయి అభ్యంకర్, నిర్మాణం: పీఆర్ షో.