Dude | దక్షిణ భారత సినీ పరిశ్రమలో కొత్త వేవ్ కొనసాగుతోంది. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లను దాటి, యూత్‌కు దగ్గరయ్యే కథలతో ముందుకు వస్తున్న యంగ్ డైరెక్టర్లు,హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. తమిళ యంగ్ టాలెంట్ ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి, అనుకోకుండా హీరోగా మారగా, ఇప్పుడు ఆయన కోలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న స్టార్‌గా ఎదిగాడు. ప్రదీప్‌ను దేశవ్యాప్తంగా పాపులర్ చేసిన సినిమా ‘ లవ్ టుడే’. మొబైల్ ఫోన్ మార్చుకోవడం అనే సింపుల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం నేటి యువతను బాగా కనెక్ట్ అయి, ఊహించని విధంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఒకే సినిమాతో స్టార్ స్టేటస్ పొందిన ప్రదీప్, తన తదుపరి చిత్రం ‘డ్రాగన్’ ద్వారా హిట్ యాక్సిడెంట్ కాదని నిరూపించాడు. వరుసగా రెండోసారి 100 కోట్ల క్లబ్లో చేరి, తన బాక్సాఫీస్ రేంజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఇప్పుడు ప్రదీప్ కెరీర్లో అత్యంత కీలకమైన చిత్రం ‘డ్యూడ్’ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ట్రైలర్‌తో భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై తమిళనాడు మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ‘మైత్రీ మూవీ మేకర్స్’ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తుండటంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
పండగ సీజన్లో రిలీజ్ అవుతున్న చిత్రాల మధ్య ‘డ్యూడ్’కు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ‘డ్యూడ్’ కూడా 100 కోట్ల మార్క్ దాటితే, ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ 100 కోట్ల హీరో గా సౌత్ సినిమా చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించనున్నాడు. కోలీవుడ్‌లో ధనుష్, శివకార్తికేయన్, కార్తీ వంటి స్టార్ హీరోలు కూడా వరుసగా మూడు 100 కోట్ల సినిమాలు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు అందరి చూపులు ప్రదీప్ వైపే ఉన్నాయి. అతని మూడో హిట్ కూడా వంద కోట్ల క్లబ్లో చేరితే, ఆయన పేరు సౌత్ ఇండియాలో టాప్ లీగ్ స్టార్ల సరసన చేరడం ఖాయం.